
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి భారీగా కంప్లైంట్స్వస్తున్నాయి. బాధితులు లంచం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ ఆఫీసర్లపై నేరుగా, లేదా మెయిల్స్, టోల్‌ఫ్రీ నంబర్స్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్కువగా రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీఏ, ఎలక్ట్రిసిటీ, వాటర్‌బోర్డ్, పోలీసులపై ఉంటున్నాయని ఏసీబీ ఆఫీసర్లు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో టోల్‌ఫ్రీ నంబర్1064కు 450కి పైగా కాల్స్ రాగా, ఈ ఏడాది 76 కాల్స్ వచ్చాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదు చేసే వారి వివరాలు రహస్యంగా ఉంచేందుకు ఏసీబీ 2014లో టోల్ ఫ్రీ నంబర్1064ను ప్రారంభించింది. ఈ నంబర్‌కి వచ్చే ప్రతి కాల్ ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఆధారంగా సంబంధిత జిల్లాల, యూనిట్స్ ఉన్నతాధికారులను అలర్ట్ చేస్తున్నారు. బాధితుడి ద్వారా లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్లను ట్రాప్ చేసి పట్టుకుంటున్నారు.