పెరుగుతున్న కరెంట్ బండ్ల అమ్మకాలు

పెరుగుతున్న కరెంట్  బండ్ల అమ్మకాలు
  • ఈవీలపై పెరుగుతున్న హైప్
  • డిమాండ్ కంటే 20 రెట్లు ఎక్కువ కెపాసిటీతో కంపెనీలు 
  • కరెంట్ బండ్లకు షిఫ్ట్‌‌‌‌ అవ్వడం కచ్చితమంటున్న ఎనలిస్టులు

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్​కు చెందిన 23 ఏళ్ల అర్జున్  టూ వీలర్ తీసుకోవాలనుకున్నాడు. పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బైక్​కు బదులు హై స్పీడ్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొన్నాడు. ఈవీ ఎందుకు తీసుకున్నావని అడిగితే..   ‘పెట్రోల్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌దే ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కదా’ అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి ఎలక్ట్రిక్ టూవీలర్లపై హైప్ పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.  ఇప్పటికీ దేశంలో అమ్ముడయ్యే ప్రతి 100 టూ వీలర్లలో ఒకటి మాత్రమే ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్ ఉంటోంది. కానీ,  ఈవీ టూ వీలర్లకు మార్కెట్‌‌‌‌‌‌‌‌ షేరు లేకపోయినా మైండ్ షేరు ఉందని చెబుతున్నారు ఎనలిస్టులు. స్టార్టప్‌‌‌‌‌‌‌‌లతో సహా పెద్ద కంపెనీలు ఈవీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవుతుండడంతో ఈవీలపై డిమాండ్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ అవుతోందని అన్నారు. ప్రస్తుతం ఎథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓలా, హీరో, బౌన్స్‌‌‌‌‌‌‌‌, రెవొల్ట్‌‌‌‌‌‌‌‌, అంపెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒకినావా వంటి ఏడు కంపెనీల తయారీ సామర్థ్యం  ఏడాదికి 30 లక్షల యూనిట్లు.  

ఇందులో ఒక్క ఓలా కెపాసిటీనే ఏడాదికి 20 లక్షల యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ల సేల్స్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ కంపెనీల మొత్తం కెపాసిటీ 20 రెట్లు ఎక్కువ. వీటికి అదనంగా బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్‌ టూవీలర్ల సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ కంపెనీలు అదనంగా ఏడాదికి 1.2 కోట్ల యూనిట్లను తయారు చేస్తామని ప్రకటించాయి. ఇవే కాదు ఆటమ్‌‌‌‌‌‌‌‌ వంటి మరికొన్ని స్టార్టప్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు కూడా  ఈ–టూవీలర్లను తీసుకొస్తున్నాయి. దీన్ని బట్టి కంపెనీలు సైతం ఈవీలకు షిఫ్ట్ అవ్వడం తధ్యమనే ఆలోచనలో ఉన్నాయి. 
మూడు కారణాలు..
ప్రస్తుతం ఈవీ తయారీ కంపెనీలకు  టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ, సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌, ఈవీలపై హైప్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఉన్నాయి..ఒక్క డిమాండ్ తప్ప.  డిమాండ్‌‌‌‌‌‌‌‌ కూడా కొద్ది కొద్దిగా పుంజుకుంటోంది. కిందటి ఏడాది మొత్తం 1.35 లక్షల హై స్పీడ్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. మొత్తం పెట్రోల్ టూవీలర్ల అమ్మకాల్లో వీటి వాటా 1.1 శాతమే. అయినప్పటికీ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సేల్స్‌‌‌‌‌‌‌‌ ఐదు రెట్లు పెరిగాయి.  కొత్త శకం స్టార్టవుతోందని ఇండస్ట్రీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్  అంచనా వేస్తున్నారు.  కొత్త ఏడాదిపైన ఈవీ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయని అన్నారు. ఇలా ఆశలు పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. లీటర్ పెట్రోల్ రేటు రూ. 100 దాటింది. సైకలాజికల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే కన్జూమర్లకు ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌ కీలకం.

రెండోది కేంద్రం ఇచ్చే సబ్సిడీ డబులయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీలపై అదనంగా సబ్సిడీ ఇస్తున్నాయి. దీంతో ఈవీల కాస్ట్ దిగొస్తోంది. ఇంకా పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బండ్ల ధరలు 15–20% పెరిగాయి. దీంతో  ఈవీలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కన్జూమర్లు.  మరోవైపు పర్యావరణానికి హాని కలిగించకకూడదని అనుకునేవాళ్లు కూడా ఈవీల వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఈవీలకు మారడం కచ్చితంగా జరుగుతుందని, ఆలస్యం చేస్తూ ఉండేవాళ్లు నష్టపోతారని ఈవీలకు మోటార్లను తయారు చేసే ఎస్‌‌‌‌‌‌‌‌ఈజీ ఆటోమోటివ్ ఇండియా పేర్కొంది.
చార్జింగ్ ఇన్​ఫ్రా పెరగాలే..
కంపెనీలకు కొన్ని సమస్యలు కూడా లేకపోలేదు. తాజాగా ఓలా ఎలక్ట్రిక్  తన స్కూటర్లను డెలివరీ చేయడంలో ఇబ్బందులు పడింది. పుణేకి చెందిన టార్క్‌‌‌‌ మోటార్స్‌‌  ఇప్పటికీ తన మొదటి  ఎలక్ట్రిక్ మోటర్‌‌‌‌ సైకిల్‌‌ను తెచ్చేందుకు కష్టపడుతోంది. 22 మోటార్‌‌‌‌  ఈవీ సెక్టార్‌‌‌‌లో సస్టయిన్ కాలేక తన బిజినెస్‌‌ను బౌన్స్‌‌కు 2018 లో విక్రయించింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న  ఎథర్ ఎనర్జీ కూడా చాలా సమస్యలను ఎదుర్కొంది. దీన్ని బట్టి ఈవీ సెగ్మెంట్‌‌లో విస్తరించడం కంపెనీలకు అంత ఈజీ కాదనే విషయం తెలుస్తోంది.  ఛార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా విస్తరించాల్సి ఉంది.

ప్రజలు ఈవీలకు షిఫ్ట్‌‌ అవ్వడంలో మెరుగైన ఛార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కీలకం.  పెట్రోల్ ధరలు పెరుగుతుండడం, ప్రభుత్వ సపోర్ట్, కొత్త ప్రొడక్ట్‌‌లు అందుబాటులోకి వస్తుండడంతో ఈవీలకు షిఫ్ట్ అవ్వడం పెరుగుతోందని బజాజ్‌‌ ఆటో పేర్కొంది. ఈవీల అడాప్షన్‌‌ పెరుగుతోందని తెలిపింది. పెద్ద పెద్ద రిటైల్ కంపెనీలు, డెలివరీ కంపెనీలు తమ లాస్ట్ మైల్‌‌ డెలివరీ కోసం ఈవీలను ఎంచుకుంటున్నాయి. బ్యాటరీ లైఫ్‌‌, రీసేల్‌‌ వాల్యూపై ఈవీల  విస్తరణ ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు  చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ వెహికల్ తమ దగ్గర కూడా ఉండాలనే హైప్‌‌లో కన్జూమర్లు ఉన్నారని, ఒక్కసారి ఈవీలు బాగా అందుబాటులోకి వచ్చేస్తే  ఈ హైప్ తగ్గుతుందని అన్నారు.