హిమాయత్ సాగర్​కు పెరుగుతున్న ఇన్ ఫ్లో.. మరో నాలుగు గేట్లు ఓపెన్

హిమాయత్ సాగర్​కు పెరుగుతున్న ఇన్ ఫ్లో.. మరో నాలుగు గేట్లు ఓపెన్

హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. దీంతో హిమాయత్ సాగర్ మరో నాలుగు గేట్లను శనివారం ఎత్తారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షలు కురవడంతో జంట జలాశయాలకు ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో హిమాయత్ సాగర్ గేట్లు శుక్రవారం రెండు ఎత్తగా.. శనివారం ఉదయం 10 గంటలకు మరో రెండు గేట్లు, మధ్యాహ్నం 1 గంటలకు ఇంకో రెండు గేట్లు రెండు ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

మొత్తం 6 గేట్ల ద్వారా  వరద నీటిని దిగువనున్న మూసీలోకి పంపుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1763.50 అడుగుల నీటి మట్టం ఉంది.