ఎగువన వర్షాలతో కాళేశ్వరానికి పెరుగుతున్న వరద

ఎగువన వర్షాలతో కాళేశ్వరానికి పెరుగుతున్న వరద
  • మేడిగడ్డకు 17 వేల క్యూసెక్కులు
  • 10 గేట్లు తెరిచి 15 వేల క్యూసెక్కుల నీళ్లు కిందికి
  • పోయినేడు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 నుంచే కాళేశ్వరం మోటార్లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఎగువన పడుతున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రాణహిత వరద రోజురోజుకి పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి సోమవారం సాయంత్రం 17 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లో ఉంది. పోయినేడు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16న కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి అన్నారం బ్యారేజీలోకి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆఫీసర్లు ఈ సారి మాత్రం బ్యారేజీ గేట్లను తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లుగా విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 గేట్లు తెరిచి 15 వేల క్యూసెక్కుల నీళ్లను   కిందికి వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

రోజు రోజుకి పెరుగుతున్న వరద

మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత వరద ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నెల 25న 5,900 క్యూసెక్కుల వరద మాత్రమే ఉండగా రెండ్రోజుల్లోనే 17 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం నుంచి గంటగంటకు వరద పెరుగుతూనే ఉంది. ఈ నెల 26న ఉదయం 6 గంంటలకు 9 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉండగా సోమవారం ఉదయం నాటికి 16,780కు పెరిగింది. సాయంత్రం నాటికి మరో వెయ్యి క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో పెరిగినట్లుగా నీటి పారుదల శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. పోయినేడాది ముందస్తుగా వర్షాలు పడ్డాయి. ఈ సారి వానలు కాస్త ఆలస్యం అయినట్లుగా ఆఫీసర్లు చెబుతున్నారు. 

నిరుడు లిఫ్ట్ చేసిన నీళ్లన్నీ వృథాగా 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీటిని రాష్ట్ర మంతటా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పోయినేడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16న కన్నెపల్లి వద్ద 4 మోటార్లను రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. వానలు అప్పుడే స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా అన్నారం బ్యారేజీలోనూ వెంటనే 2 మోటార్లను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సుందిళ్ల బ్యారేజీలోకి నీళ్లు ఎత్తిపోశారు. అప్పుడు ప్రాణహితలో 50 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉంది. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి ఉప్పొంగడం గోదావరిపై కట్టిన అన్ని బ్యారేజీల గేట్లు తెరవడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన నీళ్లన్నీ వృథాగా కిందికి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈసారి ఆఫీసర్లు తొందరపడట్లేదు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లను తెరిచి 15 వేల క్యుసెక్కుల వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దిగువకు విడుదల చేస్తున్నారు.