IND vs ENG 2nd Test: బుమ్రా విజృంభణ.. స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్

IND vs ENG 2nd Test: బుమ్రా విజృంభణ.. స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్

వైజాగ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. బుమ్రా(6 వికెట్లు), కుల్దీప్(3 వికెట్లు) ద్వయం చెలరేగడంతో ఇంగ్లాండ్ 253 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. జాక్ క్రాలీ(70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్ స్టోక్స్(47) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

336-6 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్(209) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయగా.. శుభ్ మాన్ గిల్‌ (34), శ్రేయాస్ అయ్యర్(27), పటీదార్‌(32), అక్సర్ పటేల్(27) పర్వాలేదనిపించారు. చివరలో అశ్విన్‌.. 37 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 20 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు క్రాలీ(76) - బెన్ డకెట్(21) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడగొట్టాడు. ఆపై భారత స్పీడ్ గన్ బుమ్రా.. ఇంగ్లాండ్ బ్యాటర్ల పతనాన్ని శాసించాడు. ఓలీ పోప్(23), జో రూట్(5), జానీ బెయిర్‌స్టో(25), బెన్ స్టోక్స్(47)... ఇలా వరుస విరామాల్లో వికెట్లు ఇంగ్లాండ్‌ను  కోలుకోనివ్వకుండా చేశాడు. పదునైన పేస్‌కు బౌన్స్ జోడించి ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో ఇంగ్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో143 పరుగుల భారీ అధిక్యం లభించింది.