Virat Kohli 50th ODI Century: ఇండియా మొత్తం.. విరాట్ కోహ్లీకి సలాం కొట్టింది

Virat Kohli 50th ODI Century: ఇండియా మొత్తం.. విరాట్ కోహ్లీకి సలాం కొట్టింది

ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా భారత స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ పోరులో శతకం బాదిన కోహ్లీ.. తాను ఆరాధించే భారత మాజీ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అధిగమించాడు. సచిన్ వన్డే సెంచరీలు 49 కాగా, వన్డే చరిత్రలో 50 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అవతరించాడు. దీంతో అతనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య క్రికెట్ అభిమాని మొదలు దేశ ప్రధానమంత్రి సహా సినీ సెలబ్రిటీలు అందరూ అతనికి జయహో అంటున్నారు.

నరేంద్ర మోడీ: ఈరోజు కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధించడమే కాదు.. పట్టుదలకు, క్రీడాస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు. ఈ మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. నేను కోహ్లీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.. అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

జూ.ఎన్‌టీఆర్: 49 వన్డే సెంచరీల తిరుగులేని రికార్డును ఒక భారతీయుడు అధిగమించాడు.. అదీ భారతదేశం లో ప్రపంచకప్ సెమీఫైనల్‌లో.. ఇంతకంటే మంచి సంధర్భం మరొకటి లేదు.. అని జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు.