IND vs PAK: భారత్‍పై మనం గెలవలేం.. కనీసం పోరాడాలి కదా: పాక్ జట్టుపై PCB చీఫ్ ఆగ్రహం

IND vs PAK: భారత్‍పై మనం గెలవలేం.. కనీసం పోరాడాలి కదా: పాక్ జట్టుపై PCB చీఫ్ ఆగ్రహం

శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో పాకిస్తాన్ జట్టు చిత్తుచిత్తుగా ఓడిన విషయం విదితమే. భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడితే.. పాక్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉత్కంత పోరు కాస్తా.. వార్ వన్ సైడ్‌ అన్నట్లుగా సాగింది. ఈ ఓటమిని పాక్ అభిమానులు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమ దేశ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు, పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన దాదాపు 20 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించడం భాధగా ఉందన్న రమీజ్ రాజా.. ఇదొక మాయని మచ్చగా వర్ణించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారని అంగీకరించిన అతడు.. కనీసం భారత్‍పై గెలవలేకపోయినా.. పోరాడాలి కదా అని అభిప్రాయపడ్డారు.

భారత్‍పై మనం గెలవలేం..

"భారత్‍ తో మ్యాచ్ అంటే 99 శాతం మంది ప్రేక్షకు మద్దతు వారికే ఉంటుంది. దీని వల్ల మీరు కంగారు పడొచ్చు. ఒక ఆటగాడిగా ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకుంటా. కానీ గత నాలుగేళ్లుగా మీరాడిన ఆట ఏంటి..? బాగా ఆడారు  కదా! మంచి విజయాలు అన్ధకున్నారు కదా! ఆ ఆట ఎక్కడికి పోయింది. సందర్భాన్ని బట్టి ఆడాలి."

"ఈ ఓటమి ప్రపంచ కప్‌లలో భారత్‌తో వరుసగా ఎనిమిదో ఓటమి.  ఇది వాస్తవం. ఈ అవాంఛిత పరంపరను ముగించడానికి పాకిస్తాన్ జట్టు ఒక మార్గాన్ని కనుగొనాలి. దాని గురించి ఏదైనా చేయాలి. భారతదేశానికి వ్యతిరేకంగా వారిని 'చోకర్స్' అని పిలవలేము.. ఎందుకంటే అది కలిగి ఉండటం గొప్ప ట్యాగ్ కాదు. ఒకవేళ మీకు గెలువలేకపోయినా.. కనీసం పోరాడాలి. ఈ  మ్యాచ్ చూస్తే అలా కూడా చేయలేకపోయారు.." అని అని 1992 ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన రమీజ్ రాజా అన్నారు.

30 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు

ఈ  మ్యాచ్ లో విజయం సాధించడం ఒక ఎత్తైతే, దాదాపు 30 ఓవర్లు మిగిలివుండగానే ఛేదించటం మరో హైలెట్. 192 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86 పరుగులు) పాకిస్తాన్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఓవర్ కు రెండేసి చొప్పున బౌండరీలు బాదుతూ గల్లీ బౌలర్లుగా మార్చేశాడు.

ALSO READ : దసరా సందర్భంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్..వెబ్ సిరీస్