దసరా సందర్భంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్..వెబ్ సిరీస్

దసరా సందర్భంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్..వెబ్ సిరీస్

దసరా వచ్చిందంటే సినిమాల జాతర మొదలైనట్టే. ఈ దసరా కు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న బడా మూవీస్ ఏంటనేది..ఏ సినిమా చూడాలనేది ఆడియన్స్ ఫిక్స్ అయ్యే ఉంటారు. కానీ, చాలా మంది పండుగ బిజీల్లో ఉండి..థియేటర్స్ కి వెళ్ళని వారు ఓటీటీ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ దసరా కు ఓటీటీ లో వస్తోన్న మూవీస్ ఏంటనేది చూద్దాం. 

తెలుగు మూవీస్.. 

కృష్ణారామా 

హీరో రాజేంద్రప్రసాద్‌..సీనియర్ నటి గౌతమి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం కృష్ణారామా. 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవివర్మ, జెమినీ సురేశ్‌, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీకి రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించారు. ప్రసెంట్ జనరేషన్‌కి సంబందించిన కథ ఇది. ప్రస్తుతం సోషల్‌మీడియా అనేది ఇద్దరు వృద్ధ దంపతుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందన్నదే ఈ సినిమా కథ. ఈ మూవీ 2023 అక్టోబర్ 22న ETV విన్ ఫిల్మ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

మామా మశ్చేంద్ర 

టాలీవుడ్ ట్యాలెంటెడ్‌ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర అక్టోబర్ 6 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి..ఆడియన్స్  ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రముఖ కమెడియన్‌ అండ్‌ రైటర్‌ అయిన హర్ష వర్ధన్‌ తెరకెక్కించిన ఈ మూవీలో..సుధీర్‌ బాబును ఏకంగా మూడు పాత్రల్లో చూపించి పెద్ద సాహసమే చేశాడు. కానీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే కథలో క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ ఉండటం..అలాగే స‌రైన ప్ర‌మోష‌న్స్ చేయకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ 2023 అక్టోబర్ 20న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

మాన్షన్ 24 వెబ్ సీరిస్ 

స్టార్ యాంకర్, రైటర్, డైరెక్టర్ ఓంకార్ డైరెక్ట్ చేసిన హార్రర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, హర్రర్ థ్రిల్లర్‌తో భయపెట్టే రీతిలో ఉంది. ఈ సీరీస్ కథ విషయానికి వస్తే..దేశద్రోహిగా ముద్రపడిన తండ్రి నిజాయతీని నిరూపించే కూతురిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. ఆమె తల్లిదండ్రులుగా సత్యరాజ్, తులసి నటించారు. దేశ సంపదను దోచుకుని కనిపించకుండా పోయాడని సత్యరాజ్‌పై నిందపడుతుంది. ఆయన మ్యాన్షన్ హౌస్‌కి వెళ్లిన తరవాత నుంచీ కనిపించకుండా పోవడాన్ని వరలక్ష్మీ శరత్‌కుమార్ చేధించిన విధానంపై ఈ సీరిస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. మొత్తం 6 ఎపిసోడ్స్ గా మాన్షన్ 24 ఉండనుంది. మాన్షన్ 24  వెబ్ సీరిస్ 2023 అక్టోబర్ 17న డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ లో స్ట్రీమింగ్ కానుంది. 

తమిళ్ 

రెడ్ శాండల్ వుడ్ 

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక యదార్థ సంఘటన నుండి ప్రేరణ పొంది ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ గురు రామానుజం. గంధపు చెక్కల స్మగ్లింగ్ రాకెట్‌లో బలిపశువులుగా మారిన అమాయక వలసదారుల ఎదుర్కొన్న బాధలు..వారి న్యాయ పోరాటాల స్పూర్తితో ఈ మూవీ కథ ఉండనుంది. తమిళ యాక్షన్ డ్రామా చిత్రం 2023 అక్టోబర్ 20న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో ఈ మూవ్ తెలుగులో రిలీజ్ డబ్ చేసే ఛాన్స్ ఉంది. 

బాలీవుడ్

కాలాపానీ

అండమాన్..నికోబార్ దీవుల్లో ఉన్న నివాసితులు తెలియని వ్యాధితో..అనారోగ్యంతో పోరాడుతున్నప్పుడు..వారి మనుగడ కోసం నివారణను కనుగొనే అత్యుత్తమ డ్రామా చిత్రం.ఈ మూవీ 2023 అక్టోబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

జవాన్

షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ జవాన్ నవంబర్ 2,2023న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

హాలీవుడ్

డెవిల్
 

డైరెక్టర్ క్రిస్టోఫర్ హోల్ట్ తెరకెక్కించిన ఈ మూవీ ..దెయ్యాల ప్రభావంతో బాధితురాలిని హత్య చేశానని..దోషి పేర్కొన్న మొదటి కోర్టు కేసు ఇది. 2023 అక్టోబర్ 17న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 


పేర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3

కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తమ జీవితాలను నావిగేట్ చేస్తున్నప్పుడు..కొత్త రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వారి మధ్య ఎదురైన సమస్యలపై తెరకెక్కిన ఈ మూవీ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2023 అక్టోబర్ 18న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.    

బాడీస్ 

లండన్ వీధుల్లో జరిగిన..ఒక వింత హత్య నాలుగు వేర్వేరు కాలాల నుండి..నలుగురు డిటెక్టివ్‌లను వెంటాడుతుంది.ఈ మిస్టరీకి పరిష్కారం లభిస్తుందా? లేదా అనేది కథ. బాడీస్ అనేది బ్రిటీష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, అదే పేరుతో సి స్పెన్సర్ రాసిన గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందించబడింది. దీనిని డైరెక్టర్ పాల్ టోమలిన్ తెరకెక్కించారు. ఈ మూవీ 2023 అక్టోబర్ 19న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

అప్లోడ్ సీజన్ 3

అప్‌లోడ్ సీజన్ 3 అక్టోబర్ 20, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8 ఎపిసోడ్‌లను రిలీజ్ కానుంది.