చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్

చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచులో రెండు కీలక వికెట్లు పడగొట్టిన కుల్దీప్..ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో  రెండు వికెట్లు తీయడం ద్వారా వన్డే కెరీర్ లో 157 వికెట్లు సాధించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా  కుల్దీప్ యాదవ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేరిట ఉండేది. హాగ్..123 మ్యాచుల్లో 113 ఇన్నింగ్స్ లలో 156 వికెట్లు పడగొట్టాడు.