V6 News

చెలరేగిన శ్రీలంక..భారత్ టార్గెట్-184

చెలరేగిన శ్రీలంక..భారత్ టార్గెట్-184

రెండో టీ20లో శ్రీలంక చెలరేగి ఆడింది. కెప్టెన్ శ‌న‌క (19 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) ఆఖ‌ర్లో సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ‌టంతో లంకేయులు భారీ స్కోర్ సాధించారు. అత‌నికి ఓపెన‌ర్‌ నిస్సంక (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) స‌హ‌క‌రించ‌డంతో లంక జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు స్కోర్ చేసింది.  క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డుతున్నా ఈ ఇద్ద‌రూ దూకుడుగా ఆడ‌ట‌టంతో లంక జ‌ట్టు టీమిండియాకు భారీ స్కోర్ నిర్ధేశించింది. లంక మ‌రో ఓపెన‌ర్ గుణ‌తిల‌క (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఓ మోస్తారుగా రాణించాడు. టీమిండియా బౌల‌ర్లు భువీ, బుమ్రా, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, చ‌హ‌ల్‌, జ‌డేజా త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.