
ఫోర్ల మోతలో.. సిక్సర్ల వర్షంలో.. పరుగుల వరదలో భాగ్యనగరం తడిసిముద్దయింది. కరీబియన్ వీరుల ఖలేజాను తలదన్నేరీతిలో కోహ్లీ సేన పంజా విసిరి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. విరాట్ కోహ్లీ (50 బంతుల్లో
6 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 నాటౌట్ ) వీర విధ్వంసానికి, లోకేశ్ రాహుల్ (40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62) మెరుపులు తోడవడంతో వెస్టిండీ స్ తో ఫస్ట్ టీ20లో ఇండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో తొలుత వెస్టిండీ స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోరు చేసింది. షిమ్రన్ హెట్ మయర్ (41బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఎవిన్ లూయిస్ (17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40), కీరన్ పొలార్డ్ (19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 37) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇండియా బౌలర్లలో చహల్ రెండు, జడేజా, దీపక్
ఒక్కో వికెట్ తీశారు. అనంతరం కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్ దెబ్బకు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గె ట్ ఛేజ్ చేసిన టీమిండియా ఈజీగా గెలిచింది. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.