V6 News

వావ్.. వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఫస్ట్ ఓవర్ లోనే వికెట్

వావ్.. వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఫస్ట్ ఓవర్ లోనే వికెట్

హామిల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలమైన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఢీకొంటుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కీలకైన రెండు వికెట్లు భారత్ కు దక్కగా.. భారీ స్కోర్ దిశగా న్యూజిలాండ్ జోరుమీదుంది. 15 ఓవర్లకు కివీస్ 2 వికెట్ల నష్టానికి 78 రన్స్ చేసింది. కేర్(29), సాటర్త్‌‌‌‌‌‌‌‌వైట్‌‌‌‌‌‌‌‌ (5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్ దక్కింది.  మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఇండియా వరుసగా నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడింది. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కాస్త టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైంది. గత సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే మంచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డుకట్ట వేయాలని కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తున్నాడు. వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసిన తప్పులను రిపీట్ చేయొద్దని భావిస్తున్నాడు. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెన్నెముక అయిన స్మృతి మంధానపై భారీ ఆశలు పెట్టుకున్నారు. షెఫాలీ కూడా టచ్​లోకి వచ్చి శుభారంభాన్నిస్తే మ్యాచ్ గెలవచ్చు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విఫలమైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిథాలీ కూడా భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టింది. వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తే ఇండియాకు ఇబ్బందులు తప్పినట్లే. అయితే మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రొటేట్​ చేయడంలో ఇండియా విఫలమవుతుంది. దీనిపై గట్టిగానే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక స్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బలమైన షాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం లోటు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెటరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జులన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటం సానుకూలాంశం. అయితే రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమెకు మేఘనా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మంచి సహకారం అందాలి. ఇక ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా దీప్తి శర్మ, స్నేహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా, పూజా రాణిస్తుండటం ఇండియాకు అతిపెద్ద బలంగా మారింది. స్పిన్నర్లుగా దీప్తి, రాజేశ్వరి సత్తా చూపాల్సిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేసింది. 
 

గెలవాల్సిందే..
వెస్టిండీస్​ చేతిలో ఓడి బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై గెలిచిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చాలా కీలకం. ఇందులో ఓడితే సెమీస్‌‌‌‌‌‌‌‌ ఆశలు కాస్త క్లిష్టం కావొచ్చు. అందుకే ఇండియాతో పోరును హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ తేలికగా తీసుకోవడం లేదు. డివైన్‌‌‌‌‌‌‌‌, సుజీ బేట్స్‌‌‌‌‌‌‌‌, సాటర్త్‌‌‌‌‌‌‌‌వైట్‌‌‌‌‌‌‌‌, అమెలి కెర్​.. మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వీళ్లను ఔట్‌‌‌‌‌‌‌‌ చేస్తేనే ఇండియా విక్టరీని ఆశించొచ్చు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ కివీస్‌‌‌‌‌‌‌‌కు తిరుగులేదు. లీ తహుహు, జెస్‌‌‌‌‌‌‌‌ కెర్​, జెన్సెన్‌‌‌‌‌‌‌‌ చెలరేగితే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. సాటర్త్‌‌‌‌‌‌‌‌వైట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ రాణిస్తున్నారు.  మరి గత సిరీస్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌ను ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ కివీస్‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తుందా? లేక ఆ సిరీస్​లో ఓటమికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? చూడాలి.