జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్జూబ్లీహిల్స్లోని ఓ పబ్‌లో సీరియల్ ఆర్టిస్ట్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు మాదాపూర్‌లోని సిద్ధి వినాయక నగర్‌కు చెందిన వై. హేమ భవాని(28) సీరియల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు.
ఈ నెల 26న రాత్రి ఆమె తన సోదరుడు ఎస్.సురేశ్‌రెడ్డి, బావ రాహుల్‌తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని క్లబ్ రోగ్ పబ్‌కు వెళ్లారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సోదరుడు, బావ అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని కిందకు తోసేసి దాడి చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. క్లబ్‌లోని సీసీ కెమెరాలు, సిబ్బందిని విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వ్యక్తిపై కేసు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో యువతితో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదయింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన శ్రేయా సింగ్(26) సిటీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ నానక్‌రామ్‌గూడలోని ప్రెస్టీజ్ హై ఫీల్డ్స్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 26న రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ పబ్‌కు వెళ్లింది.
అత్తాపూర్‌కు చెందిన రమేశ్ అగర్వాల్ వెనుక నుంచి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనతో ఇబ్బందికి గురైన యువతి వెంటనే పబ్‌లోని వెయిటర్‌కు చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా.. రమేశ్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయింది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
