హైదరాబాద్ సిటీలో డ్యాన్స్ బార్.. 30 మంది అరెస్ట్

హైదరాబాద్ సిటీలో డ్యాన్స్ బార్..  30 మంది అరెస్ట్

వీకెండ్ రాగానే హైదరాబాద్ లో  యువత మత్తులో మునిగి తేలుతోంది. క్లబ్ లు బార్ లంటూ అర్థరాత్రి వరకు ఎంజాయ్ చేస్తున్నారు.అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్సులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో అనుమతులు లేకుండా అసభ్యంగా డ్యాన్సులు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి 30 మందిని అరెస్ట్ చేశారు.  

ఈ ఘటన ఆదివారం రాత్రి ఎస్సార్ నగర్లో ని  హంటర్ బార్ రెస్టారెంట్ లో జరిగింది.ఇక్కడ అనుమతి లేకుండా 12 మంది అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేయిస్తున్నారు.  అదే విధంగా కస్టమర్లతో పాటు బార్  నిర్వాహకులను మొత్తం 30 మందిని అరెస్ట్ చేసినట్లు  పోలీసులు తెలిపారు.