జాబ్ సెర్చింగ్ యాప్ ఇండీడ్‌లో ఉద్యోగాల కోత

జాబ్ సెర్చింగ్ యాప్ ఇండీడ్‌లో ఉద్యోగాల కోత

ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. అది కేవలం ఐటీ కంపెనీలకే పరిమితం కాకుండా స్విగ్గీ, జొమాటో, స్నాప్ చాట్ లాంటి వాటిల్లోనూ లేఫ్ ఆఫ్ లు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి జాబ్ సెర్చింగ్ యాప్ ఇండీడ్ చేరింది. ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో 15శాతం అంటే మొత్తం 2200 ఉద్యోగులను తీసివేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీ ఆదాయం 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో గణనీయంగా తగ్గనుందని ఆ సంస్థ సీఈవో క్రిస్ వెల్లడించారు. కరోనా సమయంలో కంటే ఇప్పుడు అమెరికాలో జాబ్ ఓపెనింగ్స్ మించవని, వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో పడిపోతాయని  చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ తొలగింపునకు గురవనున్న ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు రావాల్సిన బోనస్, మార్చి నెల రెగ్యులర్ వేతనం, పెయిడ్ టైమ్ ఆఫ్, మెంటల్ హెల్త్ సర్వీసు‍ల యాక్సెస్ సహా మరిన్నింటిని సెవెరెన్స్ ప్యాకేజీలో ఇవ్వనున్నట్టు తన బ్లాగ్ పోస్టులో ఇండీడ్ ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ సీఈవో క్రిస్ హ్యామ్స్ సైతం తన వేతనంలో 25 శాతం కోత విధించుకోవడం గమనార్హం.

గత కొంతకాలంగా బిజినెస్ రంగంలో అనిశ్చితి వల్ల ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం ఆందోళనతో కంపెనీలు ఇలా ఒకేసారి లేఆఫ్స్ ప్రకటించనుండడంతో ఉద్యోగుల్లో ఆందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.