లైగర్ కు చిరు, సల్మాన్ విషెస్

లైగర్ కు చిరు, సల్మాన్ విషెస్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్.. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం రిలీజ్ కు రెడీ అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 25న విడుదల కానుంది. 'లైగర్' చిత్రాన్ని హిందీ తెలుగు తమిళం కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ నటిస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీ సెట్ కు చిత్ర బృందం వెళ్లింది.

'గాడ్ ఫాదర్' సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిరు, సల్మాన్ ఖాన్ లపై ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'లైగర్' టీమ్ తమ మూవీ కోసం ఈ ఇద్దరు బడా హీరోల బ్లసింగ్స్ అందుకున్నారు. చిరు, సల్మాన్ లైగర్ టీమ్ కు విషెస్ తెలిపారు. ఇక 'లైగర్' సినిమాని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.