సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ను తొలగించాలి : అఖిలపక్ష నాయకులు

సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ను తొలగించాలి : అఖిలపక్ష నాయకులు
  •     అఖిలపక్ష నేతల డిమాండ్
  •     8న లోక్‌‌‌‌భవన్‌‌‌‌ ముట్టడి, అనంతరం చలో ఢిల్లీ చేపడతామని వెల్లడి

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌(సీఈసీ) జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌‌‌‌ చేశారు. సర్‌‌‌‌ పేరుతో అర్హులైన ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్‌‌‌‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌ ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఏకపక్ష నిర్ణయాలతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగిపోయాయని విమర్శించారు. 

కొత్త ఓటు దరఖాస్తులో తీసుకొచ్చిన నిబంధనలను వెంటనే తొలగించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం కల్పించాలన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 8న లోక్‌‌‌‌భవన్‌‌‌‌ ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలిపారు. అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సర్‌‌‌‌పై తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌‌‌‌ షా ఆదేశాల మేరకే సీఈసీ పని చేస్తోందని మండిపడ్డారు. వివిధ పార్టీల నేతలు ఎం.వెంకటేశ్, ఎం.మహేందర్‌‌‌‌, ఉస్మాన్‌‌‌‌ హలీం హజ్రీ, సయ్యద్‌‌‌‌ ముజాహిద్‌‌‌‌, మాసంపల్లి అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌, స్టాలిన్‌‌‌‌, శ్యామ్‌‌‌‌, సలీం పాషా, రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, సంతోష్‌‌‌‌ గుప్తా, కె.హరిధర్‌‌‌‌ పాల్గొన్నారు.