విశాఖపట్నం: వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా విమెన్స్ టీమ్ తొలిసారి గ్రౌండ్‌లోకి వస్తోంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వచ్చే ఏడాది జూన్–జులైలో జరగనున్న టీ20 వలర్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్లకు దీటుగా నిలిచే యంగ్ క్రికెటర్లను పరీక్షించేందుకు టీమిండియా ఈ సిరీస్‌ను వేదికగా చేసుకోనుంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి సీనియర్లు జట్టుకు వెన్నెముకగా ఉండగా.. తమిళనాడుకు చెందిన 17 ఏండ్ల బ్యాటర్ జి. కమలిని, అండర్-19 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ వైష్ణవి శర్మ వంటి యువ కెరటాలపై సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు. వ్యక్తిగత ఇబ్బందులను పక్కనపెట్టి స్మృతి మంధాన క్రికెట్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టనుండగా, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మెరిసిన ఓపెనర్ షెఫాలీ వర్మ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. రాధా యాదవ్ గైర్హాజరీలో ఇండియా స్పిన్ బాధ్యతలను వైష్ణవి, శ్రీ చరణి పంచుకోనున్నారు. మరోవైపు చామరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు కూడా ఈ సిరీస్‌లో తమ యంగ్ ప్లేయర్ల టాలెంట్‌ను పరీక్షించనుంది.
