ఇండియాపై 400 డ్రోన్స్తో దాడి.. పాక్ డ్రోన్స్, పెల్లెట్స్ ఎలా ఉన్నాయో చూశారా..!

ఇండియాపై 400  డ్రోన్స్తో దాడి.. పాక్ డ్రోన్స్, పెల్లెట్స్ ఎలా ఉన్నాయో చూశారా..!

పాకిస్తాన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. పహల్గాం దాడికి కేంద్రంగా పనిచేసిన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయడంతో ఇండియాను ఎలాగైనా దెబ్బకొట్టాలని విఫలయత్నం చేస్తోంది. నేరుగా ఎదుర్కోలేక, దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యింది. బుధ, గురువారాల్లో (మే 7, 8) రాత్రి వేళ డ్రోన్లతో దాడికి దిగింది. 

గుజరాత్, పంజాబ్, జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో ఆర్మీ బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్స్ ప్రయోగించింది. ఎదుటి వారితో యుద్ధం చేతకానప్పుడు.. ఇక ఓడిపోతామని తెలిసినప్పుడు ఏది చేతిలో ఉంటే అది అన్నట్లుగా డ్రోన్స్, పెల్లెట్స్ ను ప్రయోగించింది. సుమారు 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు. 

ఇండియాలోని మొత్తం 36 లొకేషన్లను టార్గెట్ చేస్తూ డ్రోన్స్ ప్రయోగించినట్లు ఆమె చెప్పారు. పాక్ ప్రయోగించిన డ్రోన్స్.. తుర్కిష్ అసిస్గార్డ్ సొంగార్ డ్రోన్స్ గా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని ఆమె చెప్పారు. డ్రోన్స్ ప్రయోగానికి పాక్ పౌరవిమానాలను వినియోగిస్తుందని ఆమె తెలిపారు. పాక్ కుటిల బుద్ధికి తగిన సమాధానం చెప్పామని, డ్రోన్స్ ను నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. 

పాక్ కు నాలుగు కేంద్రాల నుంచి డ్రోన్స్ ప్రయోగించిందని, అందులో కొన్నింటికి AD రాడార్ ను కూల్చేసే కెపాసిటీ ఉంటుందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు. హెవీ క్యాలిబర్ గన్స్, ఆయుధాలతో కూడిన డ్రోన్స్ తో సరిహద్దు రేఖ వెంట దాదులకు దిగిందని, ఈ దాడులలో కొందరు సైనికులతోపాటు సామాన్యులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇండియా చేసిన ఫైరింగ్ లో పాకిస్తాన్ కూడా కొందరు సైనికులను కోల్పోయినట్లు ప్రెస్ మీట్ లో చెప్పారు.

కెమెరాలతో కూడిన డ్రోన్స్ ప్రయోగం:

పాక్ ప్రయోగించిన డ్రోన్స్ లలో 50 డ్రోన్స్ కూల్చేసినట్లు తెలిపారు. 20 డ్రోన్స్ ను చేజిక్కించుకున్నామని అన్నారు. చాలా వరకు డ్రోన్స్ ఆయుధాలు లేకుండా కెమెరాలతో ఉన్నాయని తెలిపారు. లడఖ్ లోని సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి గుజరాత్ లోని కుచ్ ఏరియాలోకి డ్రోన్స్ ప్రయోగించినట్లు చెప్పారు. డిఫెన్స్ గన్స్ ద్వారా వీటిని ధ్వంసం చేశారు. కెమెరాలతో ఉన్న ఈ డ్రోన్స్ వీడియో ఫుటేజ్ ను స్టేషన్స్ కు చేరవేసేలా ప్లాన్ చేశారు. డ్రోన్స్, పెల్లెట్స్ ను ఫోటోల్లో చూడవచ్చు.