ఒకే మ్యాచులో 781 రన్స్: చరిత్ర సృష్టించిన ఇండియా, ఆసీస్ మూడో వన్డే

ఒకే మ్యాచులో 781 రన్స్: చరిత్ర సృష్టించిన ఇండియా, ఆసీస్ మూడో వన్డే

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‎లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రికార్డ్ స్థాయిలో స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

అనంతరం చేధనకు దిగిన టీమిండియా 369 రన్స్ చేసి పోరాడి ఓడింది. ఈ మ్యాచులో ఇండియా, ఆస్ట్రేలియా ఇరుజట్లు కలిపి మొత్తం 781 పరుగులు చేశాయి. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్‎గా ఈ వన్డే రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఇంగ్లాండ్, దక్షిణఫ్రికా పేరిట ఉంది. 

2017లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డేలో ఇరుజట్లు కలిపి 678 పరుగులు చేశాయి.  తాజాగా ఈ రికార్డ్‎ను అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డే బద్దలు కొట్టింది. ఏకంగా 781 రన్స్ నమోదు కావడంతో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచుగా రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‎ను భారత్ కోల్పోయింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుంది.