
బెంగళూరు : ఆస్ట్రేలియా-భారత్ రెండో టీ20 కోసం రెడీ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరగనున్న రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ ను పంచుకోవాలని కోహ్లీసేన చూస్తుంటే.. రే ర్ ఛాన్స్‌ను సద్వి నియోగం చేసుకొని సిరీస్ పట్టేయాలని కంగారూలు కసి మీద ఉన్నారు. గత మ్యా చ్ లో స్లో వికెట్ కారణంగా ఇరు జట్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడగా..అందుకు విరుద్ధంగా చిన్నస్వామి మైదానంలో చిన్న బౌండరీ బ్యాట్స్‌మెన్ ను ఊరిస్తోంది. భారీ స్కోరు ఖాయం అనిపిస్తున్న ఈ మ్యా చ్ లో మరి పైచేయి ఎవరిదో? తొలి మ్యా చ్ ఓటమితో సిరీస్‌లో 0–1తో వెనుకబడ్డ టీమిండియా బలంగా పుంజుకొని ప్రతీకారం తీర్చు కోవాలని పట్టుదలతో ఉంది.
తద్వారా దశాబ్ద కాలంగా ఆసీస్ చేతిలో టీ20 సిరీస్ ఓడని రికార్డును నిలుపుకోవాలని చూస్తోంది. తొలి మ్యా చ్ తర్వాత ‘ఇప్పుడు ఏదైనా సాధ్యమే’ అనే విరాట్ కోహ్లీ మాటలను చూస్తే.. జట్టులో మార్పులు ఉండొచ్చు. ఫస్ట్ మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ఆసీస్ అదే జట్టుతో బరిలో దిగనుంది. రాహుల్ పక్కా.. వైజాగ్ మ్యా చ్ లో టీమడియా బ్యాటింగ్ ఆకట్టుకోలేకపోయింది. ఒక దశలో 9 ఓవర్లలో 69/1తో ఉన్న కోహ్లీసేన చివరకు 126 పరుగులకే పరిమితమైంది. చివర్లో బౌలర్లు చెలరేగి పోటీలో నిలిపారు గాని లేకుంటే లాస్ట్ ఓవర్ కు ముందే ఇండియా ఓటమి ఖరారయ్యేది. 127 రన్స్ టార్గెట్ ను చివరి బంతి వరకు తీసుకెళ్లగలిగిందంటే ఆ ఘనత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, యార్కర్ కింగ్ బుమ్రాదే. విశ్రాంతి తర్వాత వచ్చి రావడంతోనే బుమ్రా తన విలువేంటో చాటుకున్నాడు. నరాలు తెగే ఒత్తిడి మధ్య 19వ ఓవర్ వేసిన అతడు 2 పరుగులే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీయడంతో భారత్ పోటీలోకొచ్చింది.
కానీ ఉమేశ్ ఆ ఒత్తిడిని కొనసాగించడంలో విఫలం కావడంతో సిరీస్ సమం చేసేందుకు తంటాలు పడాల్సిన దశలో నిలిచది. ‘వరల్డ్ కప్ కు ముందు రాహుల్, పంత్ కు వీలైనన్ని ఎక్కు వ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం’ అన్న కోహ్లీ వైఖరి చూస్తే ఈ మ్యా చ్ లోనూ రాహుల్, పంత్ ఆడటం పక్కా అనిపిస్తోంది. తొలి మ్యా చ్ లో ధవన్ స్థా నంలో ఆడిన రాహుల్ హాఫ్ సెంచరీతో అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఈ మ్యా చ్ లోనూ అతను ఓపెనర్ గా బరిలో దిగనున్నాడు. అది ధవన్ కు బదులుగానా.. లేక రోహిత్ కా అనేది తేలాల్సి ఉంది.
Training ✔️✔️#MenInBlue sweat it out at the training session ahead of the final T20I against Australia#INDvAUS pic.twitter.com/mBj7UgvgVK
— BCCI (@BCCI) February 26, 2019