బౌలర్లను చూస్తే గర్వంగా ఉంది : కోహ్లీ

బౌలర్లను చూస్తే గర్వంగా ఉంది : కోహ్లీ

వైజాగ్ : ఆదివారం ఆసిత్ జరిగిన ఫస్ట్ టీ20లో భారత్ ఓడిపోయిన ..తమ ప్లేయర్లు గెలిచారన్నాడు కెప్టెన్ విరాట్. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లీ..తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నాడు. ‘బౌలర్ల పోరాటం చూస్తే చాలా గర్వంగా ఉంది. తక్కువ టార్గెట్ ఉన్న ఈ మ్యాచ్‌ ను మేం ఇంత వరకు లాక్కొస్తామని అస్సలు ఊహించలేదు. బుమ్రా అద్భుతం చేశాడు. మయాంక్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌ ను అందిపుచ్చుకోలేకపోయాం. 15వ ఓవర్‌ వరకు పిచ్‌ బ్యాటింగ్‌ కు ఏ మాత్రం సహకరించలేదు. మేం బ్యాటింగ్‌ లో వైఫల్యం చెందాం. టీ20ల్లో తక్కువ స్కోర్లతో గెలవడం చాలా కష్టం. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా రాహుల్‌, పంత్‌ లకు అవకాశం కల్పించాం. రాహుల్‌ అద్భుతంగా ఆడాడు. అతడితో నేను మంచి భాగస్వామ్యం కూడా నెలకొల్పా. ఈ పిచ్‌ పై 150 పరుగులు చేసుంటే గెలిచేవాళ్లం. మా కంటే అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆసీస్‌ ఆటగాళ్లు ఈ విజయానికి అర్హులు.’ అని తెలిపాడు కోహ్లి

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ చివరకు ఆసీస్‌ వశమైంది. భారత్‌ బ్యాట్స్‌ మెన్‌ లో రాహుల్‌ (36 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ చేయగా… ధోని (37 బంతుల్లో 29 నాటౌట్‌; 1 సిక్స్‌), కోహ్లి (17 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్‌ మెన్‌ వైఫల్యం.. వేగంగా ఆడకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది.