కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు విజయంతో కొత్త సీజన్‌ను మొదలుపెట్టింది. మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–14, 22–20తో సుంగ్ షువో యున్ (చైనీస్‌తైపీ)పై గెలిచింది. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–13, 21–15తో లీ జి హుయి–యాంగ్ పో సున్ (చైనీస్‌తైపీ)పై నెగ్గారు.
విమెన్స్ డబుల్స్‌లో ట్రిసా జాలీ–పుల్లె గాయత్రి 9–21, 23–21, 19–21తో కుసుమ–ట్రియాస్ (ఇండోనేసియా) చేతిలో ఓడి నిరాశపరిచింది. రుతుపర్ణ–శ్వేతపర్ణ, కవిప్రియ–సిమ్రాన్ సింగి కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–రుత్వికా శివాని, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టోకు ఓటమి తప్పలేదు.
