జకర్తా: ఆసియా కప్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ టోర్నీలో ఇండియా ఫుట్‌బాల్ టీమ్ బోణీ చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా 2–0తో కంబోడియాను ఓడించింది. ఇండియా తరఫున సునీల్ ఛెత్రి (13, 59వ ని) రెండు గోల్స్ చేశాడు. దీంతో ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో హయ్యెస్ట్ గోల్స్ చేసిన మూడో ప్లేయర్‌గా ఛెత్రి (82) రికార్డుల్లోకెక్కాడు. రొనాల్డో (117), మెస్సీ (86) ముందున్నారు. మూడో నిమిషంలోనే రిఫరీతో గొడవకు దిగడంతో సెంటర్ బ్యాక్ సందేశ్ జింగాన్ ఎల్లో కార్డ్‌కు గురైనా ఇండియా అనుకున్న ఫలితాన్ని సాధించింది.
