థర్డ్ వన్డేలో వెస్టిండీస్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 266 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ను 169 పరుగులకు కుప్పకూల్చింది భారత్. 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్ల దాటికి వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ 37.1 ఓవర్లకే 169 పరుగులకు చేతులెత్తేశారు. . నికోలస్ పురాన్ 34,ఓడియన్ స్మిత్ 36 అల్జారీ జోసఫ్ 29 మినహా ఎవరు రాణించలేదు. దీంతో 169 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3, ప్రిసిద్ధ కృష్ణ 3, కుల్దీప్ యాదవ్ 2, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రేయాస్ అయ్యర్, 80, రిషబ్ పంత్ 56, వాషింగ్టన్ సుందర్ 33,దీపక్ చాహర్ 38 పరుగులు చేశారు.వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4, వాష్ 2, జోసఫ్ 2, స్మిత్, అలెన్ లకు చెరో వికెట్ పడ్డాయి.
India beat West Indies by 96 runs in 3rd ODI in Ahmedabad to clean sweep the three-match ODI series 3-0.
— ANI (@ANI) February 11, 2022
Image Source: BCCI pic.twitter.com/PA8FY6vRnF
