- అండర్-19 ఆసియా కప్ మనదే
- సత్తా చాటిన యువ భారత్
దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దుబాయ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ 38 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 21.3 ఓవర్లలో 104/1 స్కోరు చేయగా.. వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విక్టరీ సాధించింది. భారత ఆటగాళ్లలో రఘువంశీ 56 రన్స్ తో రాణించాడు. 8 పరుగుల వద్ద ఓపెనర్ హర్నూర్ సింగ్(5) వెనుతిరిగినా… షేక్ రషీద్‌తో కలిసి రఘువంశీ రెండో వికెట్‌కు 96 పరుగుల మంచి భాగస్వామ్యం అందించాడు. దీంతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు 9 సార్లు అండర్-19 ఆసియా కప్‌ను నిర్వహించగా… 8 సార్లు భారత్ విజేతగా నిలవడం విశేషం. 2017లో మాత్రం పాకిస్థాన్‌ను ఓడించి ఆప్ఘనిస్తాన్ ఈ టైటిల్‌ను అందుకుంది.
C. H. A. M. P. I. O. N. S ?
— BCCI (@BCCI) December 31, 2021
Congratulations and a huge round of applause for India U19 on the #ACC #U19AsiaCup triumph. ? ? #INDvSL #BoysInBlue pic.twitter.com/uys39M1b64
