మేమంతా మీ వెంటే..స్టూడెంట్స్కు మద్దతుగా రోడ్డెక్కిన ఇండియా కూటమి నేతలు

మేమంతా మీ వెంటే..స్టూడెంట్స్కు మద్దతుగా రోడ్డెక్కిన ఇండియా కూటమి నేతలు
  • గాంధీ స్మృతి వద్దకు ఎంపీలు 
  •  రాహుల్ నేతృత్వంలో ‘నీట్’ మృతులకు నివాళులు
  •  యూత్​ భవిష్యత్తును నాశనం చేస్తున్నదే మీరేనంటూ 
  • మోదీపై రాహుల్ మండిపాటు    పేపర్ లీకేజీల బాధ్యులను 
  • రక్షిస్తున్నారని ఫైర్      స్టూడెంట్ల ప్రతి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ 
  • మద్దతు తెలుపుతున్నామని ప్రకటన
  • నేడు దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నదే ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్​అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఫైర్ అయ్యారు. యువత భవిష్యత్తుకు ఆయనే అత్యధికంగా హాని చేశారని అన్నారు. నీట్​పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో ప్రకటించిన కొద్ది నిమిషాలకే రాహుల్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మన యువత భవిష్యత్తుకు అత్యంత హాని చేసింది మీరే. మన విద్యా వ్యవస్థను పూర్తిగా చేజిక్కించుకోవడానికి, నాశనం చేయడానికి మీరే అనుమతించారు, ప్రోత్సహించారు. అంతేకాక, దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ రక్షించారు’’ అని మండిపడ్డారు.

ప్రస్తుతం విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని.. వారిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాగా, నీట్ పేపర్ లీక్ కారణంగా ఆందోళనతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండియా కూటమి ఎంపీలు గురువారం రాత్రి నివాళులు అర్పించారు. ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు తాము పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించారు. ముందుగా ఢిల్లీలోని 5, సునేరీ బాగ్ రోడ్డులో ఉన్న రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాలు, ఇతర ప్రతిపక్ష నాయకులు అక్కడి నుంచి మూడు బస్సుల్లో బయలుదేరి, తీస్ జనవరి మార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గాంధీ స్మృతి భవనం(మహాత్మా గాంధీ హత్యకు గురైన ప్రాంతం) వద్దకు 
చేరుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీలు చేతులు జోడించి.. ‘నీట్’ మృతులకు నివాళులర్పించారు. ఆ తర్వాత అంతా కలసి జాతీయ గీతాన్ని ఆలపించారు. 


రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగం ప్రతిని, మరో చేతిలో జాతీయ జెండాను పట్టుకుని రాగా.. ప్రతిపక్ష ఎంపీలు మహువా మాఝీ, మహువా మొయిత్రా జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని కనిపించారు. గాంధీ స్మృతి వద్ద కొంతమంది ఎంపీలు తమ మొబైల్ ఫోన్లలో టార్చ్ లైట్లను ఆన్ చేసి క్యాండిల్ లైట్ ర్యాలీ తరహాలో ప్రతీకాత్మక నిరసన తెలిపారు. 

విద్యార్థులు రోడ్లపై ఉంటే.. మేమూ రోడ్లపైనే.. 

గాంధీ స్మృతి వద్ద నీట్ మృతులకు నివాళులు అర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. భారత విద్యార్థులకు అండగా నిలవకుండా తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బస్సులో వెళ్తూ తాను మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ‘‘విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష ఎంపీలను ఇండియా గేట్ వద్దకు తీసుకువెళ్లాలని భావించాం. కానీ అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత గాంధీజీ హత్యకు గురైన ప్రాంతమైన తీస్ జనవరి మార్గ్‌‌కు తీసుకువెళ్లాలని అనుకున్నాం. మేం అక్కడికి చేరుకోకుండా ఉండేందుకు ఇప్పుడు మా ముందు ఈ బస్సును అడ్డంగా పెట్టారు. మమ్మల్ని ఆపడానికి, మా కదలికలను నిరోధించడానికి ఈ బస్సును, బారికేడ్లను ఏర్పాటు చేశారు. వారు ఇలా నాటకం ఆడుతున్నారు. వారు భయపడుతున్నారని స్పష్టమవుతోంది. విద్యార్థులు రోడ్డెక్కినప్పుడు ఎంపీలమైన మేం కూడా రోడ్డుపైనే ఉండాలని భావించాం’’ అని చెప్పారు. అంతకుముందు కూడా ‘ఎక్స్’లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ‘‘శాంతియుతంగా న్యాయం, బాధ్యతను డిమాండ్ చేసినందుకు దెబ్బలు తిని, ఈరోజు గాయపడి ఉన్న విద్యార్థులకు అండగా నిలబడేందుకు వెళ్తున్నాం. భారత విద్యార్థులు ఒంటరి కాదు. మొత్తం ప్రతిపక్షం వారికి, వారి డిమాండ్లకు అండగా నిలుస్తుంది”అని పేర్కొన్నారు.  

ముందు అడ్డుకుని.. తర్వాత అనుమతి..

రాహుల్ నివాసం నుంచి తీస్ జనవరి మార్గ్ వైపు బయలుదేరిన కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు సునేరీ బాగ్ రోడ్డులో ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బారికేడ్లను తొలగించి రాహుల్, ఇతర ఎంపీలను ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. అయితే, వారు సునేరీ బాగ్ రోడ్డు చివరికి, అమిత్ షా నివాసానికి సమీపంలోకి చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో బీఎన్‌‌ఎస్ సెక్షన్163 అమల్లో ఉన్నందున అక్కడ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి లేదని చెప్పారు. కానీ, కాసేపటి తర్వాత రాహుల్, ఇతరులను తీస్ జనవరి మార్గ్ వైపు వెళ్లేందుకు అనుమతించారు.

కాగా, రాహుల్ నివాసంలో మధ్యాహ్నం జరిగిన సమావేశంలో.. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం అంశాన్ని వీధుల నుంచి పార్లమెంటు వరకు గట్టిగా లేవనెత్తేందుకు చేపట్టాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష ఎంపీలు చర్చించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధానంపై ఎంపీలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడినట్లు సమాచారం. సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఎంపీ కుమారి సెల్జా, సీనియర్ నాయకులు పి.చిదంబరం, ప్రమోద్ తివారీ, కే సురేష్, కుమారి సెల్జా, ప్రణితి షిండే పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్‌‌జేడీ నాయకులు సంజయ్ యాదవ్, సుధాకర్ సింగ్, మీసా భారతి, సీపీఎం ఎంపీ  జాన్ బ్రిట్టాస్, ఆర్‌‌ఎస్‌‌పీ నాయకుడు ఎన్‌‌కే ప్రేమచంద్రన్, టీఎంసీ నాయకులు మహువా మొయిత్రా, సౌగతా రాయ్ తదితరులు కూడా హాజరయ్యారు.

ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే: సీజేపీ

ప్రధాని ప్రకటనపై సీజేపీ కూడా స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాని చేసిన ప్రకటనలో జవాబుదారీతనం లేదని, సమస్యను పరిష్కరించలేదని తెలిపింది. అయితే, ప్రధాని స్పందనను సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్వాగతించారు. కానీ, దాదాపు నెలన్నర నిరసనల తర్వాత ఇది వచ్చిందని, పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌‌ల వెనుక ఉన్న ప్రధాన ప్రశ్నకు ఇది సమాధానం ఇవ్వలేదని అన్నారు.

‘పేపర్ లీక్ జరిగిపోయాక ఇప్పుడు ఎలాంటి శిక్ష విధిస్తారు? అది పేపర్ లీక్‌‌ల సమస్యను పరిష్కరించదు. అసలు ప్రశ్న ఏమిటంటే, పేపర్ లీక్‌‌లు ఎందుకు జరుగుతున్నాయి? ఆ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్పాలి’ అని ఆయన అన్నారు. గాయపడిన తర్వాత మందు పూయడం ఒక పద్ధతి అని.. కానీ, అసలైన పోరాటం గాయం జరగకుండా నివారించడమని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థను నడుపుతున్న వ్యక్తులకు జవాబుదారీతనం గానీ, సామర్థ్యం గానీ లేకపోవడం వల్లే ఈ గాయం జరుగుతూనే ఉందని.. అందువల్ల, ఈ చర్యలు ఏ విధంగానూ సరిపోవని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రజాగ్రహం ఇప్పుడు క్రమంగా ప్రధాని మోదీ వైపు మళ్లుతోందని.. మరింత మంది నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని రాంకా పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము జంతర్​మంతర్​ను విడిచిపెట్టి వెళ్లమని రాంకా తేల్చి చెప్పారు.