మన దేశ ప్రతిపాదనకు గ్లాస్గో క్లైమేట్​ సమ్మిట్‌‌‌‌‌‌‌‌ ఆమోదం

మన దేశ ప్రతిపాదనకు గ్లాస్గో క్లైమేట్​ సమ్మిట్‌‌‌‌‌‌‌‌ ఆమోదం

గ్లాస్గో: స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌26) ఓ ముఖ్యమైన నిర్ణయంతో ముగిసింది. గ్రీన్ ​హౌస్ ​వాయువులు పెరగడానికి కారణమవుతున్న బొగ్గు, ఫాజిల్​ ఫ్యూయెల్స్​ వాడకాన్ని ఒకేసారి తగ్గించడం (ఫేజ్​ఔట్​) కాకుండా దశల వారీగా (ఫేజ్​ డౌన్) తగ్గించుకుందామని ఇండియా చేసిన ప్రతిపాదనకు దాదాపు 197 దేశాలు అంగీకరించాయి. గ్లాస్గో క్లైమేట్​ ప్యాక్ట్​కు ఓకే చెప్పాయి. కార్బన్​ ఎమిషన్స్​ను తగ్గించుకోవడంపై చర్చించేందుకు వచ్చే ఏడాది సమావేశం కావడానికి ఒప్పుకున్నాయి. ‘2030 నాటికి కార్బన్ ఎమిషన్స్​ను సగానికి తగ్గించడం, అభివృద్ధి చెందిన దేశాల నుంచి రూ. 7.5 లక్షల కోట్లను పొందడం, ఆ డబ్బులో సగాన్ని వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖర్చు చేసే విషయమై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. ఇందులో ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోయాం. కానీ మరో మంచి నిర్ణయమైతే తీసుకోగలిగాం’ అని యూఎన్ ​సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ అన్నారు. ఈ కీలక ఒప్పందం భూమి, మనుషులు సమస్యల్లేకుండా బతికేందుకు ఓ ముందడుగని కాప్​26 అధ్యక్షుడు అలోక్​ శర్మ చెప్పారు. 

విపరీతంగా వాడొద్దు.. 

కోల్​పవర్​ను పూర్తిగా తగ్గించడానికి బదులు దశల వారీగా తగ్గిస్తామని చెప్పడంతో తీవ్రంగా నిరాశ చెందామని మరికొన్ని దేశాలు అన్నాయి. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. పేదరికాన్ని తగ్గించేందుకు, అభివృద్ధి చెందేందుకు కష్టపడుతున్న డెవలపింగ్​ దేశాలు బొగ్గు, పెట్రోల్, డీజిల్​లాంటి ఫాజిల్​ ఫ్యూయెల్స్​పై సబ్సిడీలను ఎలా తగ్గించుకోగలవని అన్నారు. ఫాజిల్​ ఫ్యూయెల్స్​ను రెస్పాన్సిబుల్​గా వాడుకోవడం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కు అని చెప్పారు. 

గ్లాస్గో సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

  • 2030 నాటి కల్లా సాధించాల్సిన క్లైమేట్​ యాక్షన్ ​ప్లాన్స్​ను దేశాలు మరింత బలంగా తయారు చేసుకోవాలి. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాన్స్​ను సమర్పించాలి. 
  • కార్బన్ ​ఎమిషన్స్‌‌‌‌ను తగ్గించేందుకు దేశాలు ఏం చేస్తున్నాయో ప్రతి సంవత్సరం నివేదికివ్వాలి. 
  • బొగ్గును ఫ్యూయెల్​గా వాడటం తగ్గించాలి. ఫాజిల్​ ఫ్యూయెల్స్​పై రాయితీలను ఎత్తేయాలి.  
  • వాతావరణ మార్పులపై పేద దేశాలు పని చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చే ఫండ్స్‌‌‌‌ రెట్టింపు చేయాలి.
  • 2025 వరకు ఏటా 100 బిలియన్​ డాలర్ల సొమ్మును అభివృద్ధి చెందిన దేశాలు అందించాలి. ఈ దేశాలు ఫండ్స్‌‌‌‌ను ఎలా అందించబోతున్నాయో ప్లాన్​ను ఇవ్వాలి.