V6 News

30ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..15రోజుల్లో 10ల‌క్ష‌లు కేసులు న‌మోదు

30ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..15రోజుల్లో 10ల‌క్ష‌లు కేసులు న‌మోదు

మ‌నదేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు 30ల‌క్ష‌లు దాటిన‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. కేంద్రం ప్ర‌క‌టించిన వివ‌రాల ప్రకారం దేశంలో ఆగ‌స్ట్ 7 నాటికి 20ల‌క్ష‌ల కేసులు న‌మోదు కాగా స‌రిగ్గా 15రోజులకే 30 ల‌క్ష‌ల కేసులు దాటాయి.

మ‌న‌దేశంలో ప్ర‌స్తుతం 30,05,281 న‌మోదు కాగా గ‌త 24 గంట‌ల్లో 29,580 మందికి సోకింది. దీంతో ఎక్కువ క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో మూడోస్థానంలో ఉంది. ఇక దేశంలో అత్య‌ధిక కేసులు మ‌హ‌రాష్ట్ర – 6,57,450, తమిళనాడు – 3,73,410 , ఆంధ్రప్రదేశ్- 3,45,216 లో న‌మోద‌య్యాయి.

కాగా 24 గంటల వ్యవధిలో 69,878 మందితో దేశంలో అత్య‌ధిక కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ప్ర‌క‌టించింది.