ఇరాన్ అధ్యక్షుడి మృతి.. సంతాప దినం ప్రకటించిన భారత్

ఇరాన్ అధ్యక్షుడి మృతి.. సంతాప దినం ప్రకటించిన భారత్

ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతి చెందడం పట్ల భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడితోపాటు విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దొల్లాహియాన్‌లకు నివాళులర్పిస్తూ కేంద్రం మే 21వ తేదీ మంగళవారం ఒక రోజు సంతాప దినం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా జాతీయ జెండాను సాధారణంగా ప్రదర్శించబడే అన్ని భవనాలపై అవతనం చేయనున్నారు. రోజంతా అన్ని రకాల అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

63 ఏళ్ల రైసీ, మంత్రి హోస్సేన్ అబ్దుల్లాహియాన్ లు మే 19వ తేదీ ఆదివారం అజర్‌బైజాన్-ఇరాన్ సరిహద్దులోని ఒక ప్రాంతాన్ని సందర్శించి తిరిగి వస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్  కుప్పకూపోలిపోయింది. ఈ ప్రమాదంలో రైసీ, అబ్దుల్లాహియాన్ లతో పలువురు అధికారులు చనిపోయారు. దీంతో ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.