
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌తో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మోడీ లేఖ రాశారు. ఆ లెటర్‌లో పాక్ ప్రజలకు విషెస్ చెప్పిన మోడీ.. పాకిస్థాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇరు దేశాల సంబంధాలు నమ్మకమనే పునాదులపై నిలబడి ఉండాలన్నారు. తొలుత పాకిస్థాన్ ఉగ్రవాదానికి దూరం కావాల్సి ఉందని సూచించారు. కరోనా మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నందుకు ఇమ్రాన్‌తోపాటు పాక్ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ లేఖ ప్రతి ఏడాది పంపించే రొటీన్ లెటరేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.