అరీనా పోలో విన్నర్ ఇండియా

అరీనా పోలో విన్నర్ ఇండియా

హైదరాబాద్‌, వెలుగు: సిటీలో జరిగిన ఇంటర్నేషనల్ అరీనా పోలో చాంపియన్‌షిప్‌లో  ఇండియా విజేతగా నిలిచింది.  మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో అండ్‌ హార్స్ రైడింగ్ క్లబ్ (హెచ్‌పీఆర్‌‌సీ)లో బుధవారం జరిగిన ఫైనల్లో ఇండియా  18–-15 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 

ఇండియా ఆటగాడు అర్సలాన్ ఖాన్(మొత్తం 9 గోల్స్ తో సత్తా చాటాడు. విన్నర్‌‌కు రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు ట్రోఫీ అందజేశారు.