మెజారిటీ వాటా భారతీయుల దగ్గరే ఉండాలి
న్యూఢిల్లీ: మనదేశంతో సరిహద్దులు పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం 40 సబ్–-సెక్టార్లను గుర్తించింది. చైనా వంటి దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు 60 రోజుల్లోనే క్లియరెన్సులు ఇవ్వడానికి ఈ చర్యలు తీసుకుంది. ఇందులో రేర్ ఎర్త్ మాగ్నెట్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, అడ్వాన్స్డ్ బ్యాటరీ కాంపోనెంట్స్ వంటి కీలక రంగాలు ఉన్నాయి.
పెట్టుబడి పొందే సంస్థలో మెజారిటీ వాటా, నియంత్రణ భారతీయ పౌరుల వద్దే ఉండాలనే నిబంధన విధించింది. పెట్టుబడి వివరాలను డీపీఐఐటీకి ముందుగానే సమర్పించాలి. ఆర్‌బీఐకి ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ విభాగాలు, సౌర విద్యుత్ ఉపకరణాలు వంటి తయారీ రంగాల్లో వేగంగా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
