
జొహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్టులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఫస్ట్ నుంచే కష్టాలు మొదలయ్యాయి. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్తగా పడ్డాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ ఆ వెంటనే..ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ (26) పుజారా (3), రహానే (0), హనుమ విహారి (20), పంత్ (17) దారుణంగా విఫలమయ్యారు. షమీ 9, బుమ్రా 14, సిరాజ్ ఒక పరుగు చేశారు.
ఇక రవిచంద్రన్ అశ్విన్ మాత్రం సఫారీ బౌలర్లను ఎదురొడ్డి 46 పరుగులు చేసి జట్టు స్కోరు 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. సఫారీ బౌలర్లలో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, రబడ, ఒలీవర్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 13 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి.. 33 రన్స్ చేసింది. షమీ బౌలింగ్ ల సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెడ్ మార్ర్కమ్(7) ఔట్ కాగా.. ప్రస్తుతం పీటర్సన్(12), డీన్ ఎల్గర్(11) క్రీజులో ఉన్నారు.