31 ఏండ్ల నిరీక్షణ ఫలించేనా? .. రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీపైనే అందరి దృష్టి

31 ఏండ్ల నిరీక్షణ ఫలించేనా? .. రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీపైనే అందరి దృష్టి
  • బరిలోకి పేసర్లు ఎంగిడి, రబాడ
  • మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో 

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌: వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఓటమి నుంచి తేరుకున్న ఇండియా సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్లు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో ‘టెస్ట్‌‌‌‌‌‌‌‌’కు సిద్ధమయ్యారు. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా  మంగళవారం నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ (బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ డే) జరగనుంది. మహ్మద్‌‌‌‌‌‌‌‌ అజరుద్దీన్‌‌‌‌‌‌‌‌ (1992) మినహా, సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ (1996), సౌరవ్‌‌‌‌‌‌‌‌ గంగూలీ (2001), రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ (2006–07), ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌ ధోనీ (2010–11, 2013–14), విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (2018–19, 2021–22) నాయకత్వంలోని ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌..

 సౌతాఫ్రికాపై టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. కానీ ఇప్పటి వరకు సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఈ నేపథ్యంలో 31 ఏండ్లుగా  పోరాడుతున్న ఓ అరుదైన సిరీస్‌‌‌‌‌‌‌‌ విజయం కోసం ఇప్పుడు హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌, కింగ్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ రెడీ అయ్యారు. దీంతో పాటు గత ఎనిమిది పర్యటనల్లో ఏ జట్టుకు రాని అద్భుత అవకాశం యంగ్‌‌‌‌‌‌‌‌ టీమిండియాకు వచ్చింది. మరి ఈసారైనా సఫారీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ కలను నిజం చేస్తారా? లేదా? చూడాలి. అయితే తొలి రెండు రోజులు మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది.  

శార్దూల్‌‌‌‌‌‌‌‌ X అశ్విన్‌‌‌‌‌‌‌‌

ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా అన్ని రకాలుగా సిద్ధమైంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌ రాకతో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ బలం బాగా పెరిగింది. కాకపోతే ఉపఖండం పిచ్‌‌‌‌‌‌‌‌లపై నిరూపించుకున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌కు సఫారీ పేసర్ల నుంచి కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇందులో ఈ త్రయం పాసైతేనే ఇండియా సక్సెస్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ముఖ్యంగా గిల్‌‌‌‌‌‌‌‌, జైస్వాల్‌‌‌‌‌‌‌‌ గంటలకొద్దీ క్రీజులో పాతుకుపోతేనే రన్స్‌‌‌‌‌‌‌‌ వస్తాయి. 

శ్రేయస్‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ బలహీనతను అధిగమించాలి. రాహుల్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఓకే అయినా కీపర్‌‌‌‌‌‌‌‌గా మెరుగవ్వాల్సి ఉంది. జడేజా, అశ్విన్‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవాలంటే సఫారీ బ్యాటర్లు చాలా శ్రమించాలి. ఇక పిచ్‌‌‌‌‌‌‌‌పై వేరియబుల్‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో పేసర్లకు పండుగే. ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ నెట్స్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్నప్పటికీ యంగ్ పేసర్ ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ అరంగేట్రం చేయనున్నాడు. 

బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలను పంచుకోనున్నారు.ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా జడేజా ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఖాయంగా కనిపిస్తున్నా, ఐదో బౌలర్‌‌‌‌‌‌‌‌ కోసం శార్దూల్‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌ మధ్య పోటీ నెలకొంది. మేఘావృత వాతావరణం, వర్షం వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో శార్దూల్‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. సూపర్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌పై తొలి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ కష్టమే. కాబట్టి టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ఎంచుకోవచ్చు. 

పేసర్లపైనే భారం..

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం సౌతాఫ్రికా కూడా పూర్తి స్థాయిలో సిద్దమైంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ కంటే బౌలర్లపైనే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బవూమ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. పేసర్లు రబాడ (మడమ), ఎంగిడి (చీలమండ) గాయాల నుంచి కోలుకోవడం శుభసూచకం.  ఈ పిచ్‌‌‌‌‌‌‌‌పై మూడున్నర రోజుల్లోనే రిజల్ట్‌‌‌‌‌‌‌‌ వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇరుజట్ల పేసర్లు కీలకం కానున్నారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎల్గర్‌‌‌‌‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, డి జోర్జి నిలకడగా ఆడితే భారీ స్కోరును ఆశించొచ్చు. గత టూర్‌‌‌‌‌‌‌‌లో ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన కీగన్‌‌‌‌‌‌‌‌ పీటర్సన్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లేమితో ఇబ్బందిపడుతున్నాడు. అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొత్త ప్లేయర్ డేవిడ్‌‌‌‌‌‌‌‌ బెడింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌ను తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ మహారాజ్‌‌‌‌‌‌‌‌తో పాటు పేసర్లు జాన్సెన్, కోయెట్జీ కూడా మెరిస్తే ఇండియాకు కష్టాలు తప్పవు.