V6 News

ఏంజెలా మెర్కెల్ కు స్వాగతం పలికిన మోడీ

ఏంజెలా మెర్కెల్ కు స్వాగతం పలికిన మోడీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కు రాష్ట్రపతి భవన్ దగ్గర సెర్మోనియల్ వెల్కమ్ లభించింది. రాష్ట్రపతి భవన దగ్గర ప్రధాని మోడీ.. మెర్కెల్ కు స్వాగతం పలికారు. భారత్ రావడం చాలా సంతోషంగా ఉందని, జర్మనీ భారత్ మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఏంజెలా మెర్కెల్ చెప్పారు. ఇవాళ భారత్ జర్మనీ మధ్య ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ ఐదో వార్షిక సదస్సు జరగనుంది. మెర్కెల్ తో జరిగే సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్, వాతావరణ మార్పులు, భద్రత, ఎకానమీ, ఈయూతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైనా చర్చించే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. సెర్మోనియల్ వెల్కమ్ తర్వాత మెర్కెల్ .. రాజ్ ఘాట్ వెళ్లి గాంధీ సమాధి దగ్గర నివాళులు అర్పించారు.