అఫ్గాన్‌‌కు వ్యాక్సిన్ పంపిన కేంద్రం

అఫ్గాన్‌‌కు వ్యాక్సిన్ పంపిన కేంద్రం

న్యూఢిల్లీ: ఒక పక్క కరోనా మహమ్మారి, మరో పక్క తాలిబాన్ల పాలన, అంతకుమించి కరువు.. వీటిన్నింటితో సతమతమవుతున్న అఫ్గానిస్తాన్ ప్రజలకు మన దేశం సాయం చేసింది. 5 లక్షల వ్యాక్సిన్ డోసులను ఆ దేశానికి పంపించింది. కాబుల్‌‌‌‌లోని ఇందిరా గాంధీ హాస్పిటల్‌‌‌‌లో కొవాగ్జిన్ డోసులను అందించామని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌‌‌‌టర్నల్ అఫైర్స్‌‌‌‌ శనివారం వెల్లడించింది. రానున్న కొన్ని వారాల్లో మరిన్ని వ్యాక్సిన్‌‌‌‌ డోసులను అఫ్గాన్‌‌‌‌కు పంపిస్తామని స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. పాకిస్తాన్‌‌‌‌ మీదుగా అఫ్గాన్‌‌‌‌కు వీటిని ట్రాన్స్‌‌‌‌పోర్ట్​కు సంబంధించిన విధివిధానాలపై ఐక్యరాజ్యసమితితో చర్చిస్తున్నామని తెలిపింది. 50 వేల టన్నుల గోధుమలు, ఎసెన్షియల్ మెడిసిన్స్‌‌‌‌, పది లక్షల వ్యాక్సిన్ డోసులను అఫ్గాన్‌‌‌‌కు పంపిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కాగా, వ్యాక్సిన్లను దేశంలోని అన్ని హాస్పిటల్స్‌‌‌‌కు పంపిస్తామని ఇండియాలోని అఫ్గాన్‌‌‌‌ రాయబారి ఫరీద్ మముంద్‌‌‌‌జాయ్ తెలిపారు. 2022వ సంవత్సరం మొదటి రోజున అఫ్గాన్‌‌‌‌ ప్రజల ప్రాణాలు కాపాడడానికి వ్యాక్సిన్లు పంపిన ఇండియాకు థ్యాంక్స్‌‌‌‌ అని ట్వీట్ చేశారు.