జింబాబ్వేతో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

హరారే: జింబాబ్వేతో భారత్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసేందుకు మంచి అవకాశమని.. అందుకే బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్నానని కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. రెండు వన్డేల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీమిండియా.. ఇప్పుడు క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై దృష్టిపెట్టింది. ఆఖరిదైన మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ను 3–0తో ముగించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌కు వారం రోజులే టైమ్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌కు ఇదే లాస్ట్ చాన్స్‌‌‌‌‌‌‌‌. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అతను ఒక్క రన్‌‌‌‌‌‌‌‌కే ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కేఎల్ భావిస్తున్నాడు.

 మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌పై ఆశలు పెట్టుకున్న కుర్రాళ్లు కూడా మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా తమ సత్తా ఏంటో చూపెందుకు రెడీ అవుతున్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇబ్బందుల్లేవు. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్​లోనైనా గెలిచి పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది.
టీమ్స్