Cricket World Cup 2023: టాస్ గెలిచిన భారత్.. ఇషాన్ స్థానంలో గిల్

Cricket World Cup 2023: టాస్ గెలిచిన భారత్.. ఇషాన్ స్థానంలో గిల్

వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి భారత్-పాక్ చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఈ వరల్డ్ కప్ లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇషాన్ కిషాన్ స్థానంలో డెంగ్యూ జ్వరం నుంచి కోలుకున్న శుభమన్ గిల్ వచ్చేసాడు. మరోవైపు పాక్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది.

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 
 
పాకిస్థాన్ 

అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్