
ఇస్లామాబాద్: పాకిస్తాన్ షిప్పులు ఇండియన్ పోర్టుల్లోకి రాకూడదంటూ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించిన నేపథ్యంలో దాయాది దేశం కూడా ఇదే తరహాలో ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తున్నామని, ఆ దేశ షిప్పులను ఇండియన్ పోర్టుల్లో నిలిపి ఉంచేందుకూ ఇకపై అనుమతి లేదని, పాక్ నుంచి పోస్టల్ సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టు శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇండియన్ షిప్పులు ఏవీ పాక్ పోర్టులకు వెళ్లరాదనీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం రాత్రి పాక్ కూడా ప్రతీకార ప్రకటన చేసింది. ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్పులకు తమ పోర్టుల్లో డాక్ అవ్వకుండా నిషేధం విధిస్తున్నామని పాక్ ప్రకటించింది. పాక్ షిప్పులు కూడా ఇండియన్ పోర్టుల్లోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.