ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఇండియా విమెన్స్కాంపౌండ్, మెన్స్రికర్వ్ టీమ్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి బంగారు పతకాలకు అడుగు దూరంలో నిలిచాయి. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, దీప్షిక, ప్రతీకా ప్రదీప్‌తో కూడిన విమెన్స్ కాంపౌండ్ టీమ్ సోమవారం జరిగిన ఫైనల్లో 234–-227తో బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయం సాధించింది.
మరోవైపు నాలుగు సెట్ల హోరాహోరీ మెన్స్ రికర్వ్ సెమీస్‌లో అటాను దాస్, యశ్‌దీప్ బోగే, రాహుల్‌తో కూడిన త్రయం 5–-3తో మూడో సీడ్ కజకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్స్‌లో మెన్స్, విమెన్స్ టీమ్స్.. సౌత్ కొరియా జట్లతో తలపడతాయి.
