రేపు ‘యశోభూమి’ ఓపెనింగ్.. భారత్ మండపం కంటే పెద్దది

రేపు ‘యశోభూమి’ ఓపెనింగ్.. భారత్ మండపం కంటే పెద్దది
  • రేపు ‘యశోభూమి’ ఓపెనింగ్
  • భారత్ మండపం కంటే పెద్దది
  • ఢిల్లీలోని ద్వారకలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ 

న్యూఢిల్లీ : ‘ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్​పో సెంటర్ (ఐఐసీసీ)’ (యశోభూమి)ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ద్వారకలో ప్రారంభించనున్నారు. ఢిల్లీ ఎయిర్​పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ లైన్ సేవలు కూడా ఓపెనింగ్ చేయనున్నారు. ద్వారక సెక్టార్ 21 నుంచి ద్వారక సెక్టార్ 25 వరకు ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత్ మండపం కంటే ఐఐసీసీ పెద్దగా ఉంటుంది.

ALSO READ: మహారాష్ట్రకు తెలంగాణ లిక్కర్..  ప్రాణహిత మీదుగా నాటు పడవల్లో తరలింపు 

ఇందులో మీటింగ్స్, కాన్ఫరెన్స్​లు, ఎగ్జిబిషన్​లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏరియా 220 ఎకరాల మేర విస్తరించి ఉంది. బిల్డప్ ఏరియా 44 ఎకరాలు కాగా, ఐఐసీసీని 18 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో మొత్తం 15 కన్వెన్షన్ రూమ్​లు, ఆడిటోరియం, 13 మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. 11వేల మందితో ఒకేసారి మీటింగ్ పెట్టుకోవచ్చు. దేశంలోనే భారీ ఎల్ఈడీ మీడియా స్క్రీన్స్ ఉన్నాయి. ఆడిటోరియంలో 6వేల మంది కూర్చోవచ్చు.

గ్రాండ్​బాల్​రూమ్​లో 2,500 గెస్ట్​లు, ఓపెన్ ఏరియాలో మరో 500 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. 13 మీటింగ్ రూమ్​లు 8 అంతస్తుల్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్ హాల్​ కూడా ఉంది. వేస్ట్​వాటర్ ట్రీట్​మెంట్ సిస్టమ్, రూఫ్​టాప్ సోలార్ ప్యానెల్స్, రెయిన్​వాటర్ హార్వెస్టింగ్ సౌలత్​లు ఉన్నాయి. ఐఐసీసీని ఢిల్లీ ఎయిర్​పోర్ట్ మెట్రో ఎక్స్​ప్రెస్ లైన్​కు కనెక్ట్ చేశారు. అందులో భాగంగా ద్వారక సెక్టార్ 25 మెట్రో స్టేషన్​ను కూడా మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ నుంచి యశోభూమి ద్వారక సెక్టార్ 25కు వెళ్లేందుకు 21 నిమిషాలు పడ్తాయి.