భారత్ సంతోషంతో ఉప్పొంగింది

భారత్ సంతోషంతో ఉప్పొంగింది

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో తొలి మెడల్ సాధించింది. 49 కిలోల కేటగిరీలో మీరాబాయ్ చానూ సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఆమె విజయాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మీరాబాయ్ విక్టరీతో భారత్‌ సంతోషంతో ఉప్పొంగిందని ఆయన అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇంతటి సంతోషకరమైన ఆరంభాన్ని ఊహించలేదని, మీరాబాయ్ అధ్బుతమైన ప్రదర్శనతో భారత్ సంతోషంతో ఉప్పొంగిందని ఆయన చెప్పారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆమె విజయానికి కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోడీ.. ఈ గెలుపు మొత్తం భారతీయులందరినీ మోటివేట్ చేస్తుందని అన్నారు. #Cheer4India #Tokyo2020 అన్న హ్యాష్‌ ట్యాగ్స్‌తో మోడీ ఈ ట్వీట్ చేశారు.


21 ఏండ్ల తర్వాత రికార్డ్
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయ్ చాను ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. భారత్‌కు 21 ఏండ్ల తర్వాత మళ్లీ వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించి పెట్టిందామె. 2020 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో కరణం మల్లేశ్వరి తొలిసారి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మీరాబాయ్ మెడల్ గెలుచుకుంది. ఈ సారి ఏకంగా వెండి పతకాన్ని సొంతం చేసుకోవడం విశేషం. వెయిట్ లిఫ్టింగ్‌లో ఈ మెడల్ రావడం తొలిసారి.