న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్‌లో పాకిస్తాన్ మెడిసిన్స్ స్థానాన్ని ఇండియా భర్తీ చేస్తున్నది. అఫ్గాన్ ప్రభుత్వం తన వైద్య అవసరాల కోసం 70% నుంచి 80% పాకిస్తాన్‌పైనే ఆధారపడేది. గత కొద్ది కాలంగా తాలిబాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్‌కు మధ్య సరిహద్దు వివాదాలు, టెర్రరిజం అంశాలపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇండియా మానవతా దృక్పథంతో ఆఫ్గాన్ ప్రజలకు అండగా నిలుస్తున్నది. ఆఫ్గనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే నాసిరకం మందుల కంటే, ఇండియా పంపిన నాణ్యమైన మందులకే ప్రాధాన్యత ఇస్తున్నది.
అయితే, ఆఫ్గనిస్తాన్‌కు తుర్కియే కూడా మెడిసిన్స్ సప్లై చేస్తున్నది. తాజాగా అఫ్గాన్‌కు చెందిన ఫజల్ అనే బ్లాగర్.. కీలక సమాచారాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. తుర్కియే సప్లై చేసిన 10 టాబ్లెట్ల పారాసిటామోల్ స్ట్రిప్ 40 ఆఫ్గనీస్ అయితే.. అదే ఇండియా పంపిన పారాసిటామోల్ 10 టాబ్లెట్ల స్ట్రిప్ కేవలం 10 ఆఫ్గనీస్ మాత్రమే. ఇండియా మెడిసిన్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తున్నదని, ధర కూడా తక్కువని చెప్పాడు.
