
ఓవల్ లో గురువారం (జూలై 31) ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన ఐదో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెషన్ కు ముందు సడన్ గా భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ కు ముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఫామ్ లో ఉన్న రాహుల్ తో పాటు జైశ్వాల్ ఔటయ్యాడు. క్రీజ్ లో కెప్టెన్ గిల్ (15), సాయి సుదర్శన్ (25) ఉన్నారు.
మ్యాచ్ కు ముందు చిరు జల్లులు పడడంతో ఈ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. పిచ్ మీద ఉన్న తేమను ఉపయోగించుకొని ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ పడగొట్టారు. 2 పరుగులే చేసిన జైశ్వాల్ నాలుగో ఓవర్లో అట్కిన్సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. మొదట అంపైర్ నాటౌట్ ఇచ్చినా రివ్యూ తీసుకొని ఇంగ్లాండ్ సక్సెస్ అయింది. ఈ దశలో జట్టును రాహుల్, సాయి సుదర్శన్ ముందుకు తీసుకెళ్లారు. పిచ్ స్వింగ్ కు అనుకూలించడంతో ఇద్దరూ కూడా పూర్తి డిఫెన్స్ కే పరిమితమయ్యారు.
28 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత 14 పరుగుల వ్యక్తిగత వద్ద రాహుల్ ఔటయ్యాడు. వోక్స్ ఇన్ స్వింగ్ ను డ్రైవ్ చేయాలని భావించిన రాహుల్.. ఇన్ సైడ్ ఎడ్జ్ తగిలి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 38 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ గిల్, సుదర్శన్ ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ టెస్టుకు ఇండియాతో పాటు ఇంగ్లాండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.
Heavy rain out of nowhere signals the end of the first session! Honours even so far?https://t.co/rrZF1qeH0S | #ENGvIND pic.twitter.com/hmleDTtZML
— ESPNcricinfo (@ESPNcricinfo) July 31, 2025