హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్స్‌పై భారత్, పాక్ మ్యాచ్

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్స్‌పై భారత్, పాక్ మ్యాచ్

భారత్ వర్సెస్ పాకిస్థాన్. ఈ రెండు జట్ల మధ్య నార్మల్ మ్యాచ్ జరుగుతుందంటనే... క్రికెట్ లవర్స్ కి ఎక్కడలేని ఊపొస్తది. అలాంటిది వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు తళపడ్తున్నాయంటే వారికి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటదో మాటల్లో చెప్పలేము. అందుకే దుబాయ్ లో జరిగే ఇండియా-పాక్ మ్యాచ్ కోసం.. కొందరు ప్రత్యక్షంగా మ్యాచ్ చూడ్డానికి వెళ్తుంటే.. మరికొందరు హైదరబాద్ లోనే ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక టీ20 వరల్డ్ లో భారత్-పాక్ మ్యాచ్ దుబాయ్ లోనే జరుగుతున్నా... హైదరబాద్ లో జరుగుతోందా అని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు పలు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు. బిగ్ స్క్రీన్స్, ప్రొజెక్టర్లతో ప్రత్యేకంగా స్క్రీనింగ్స్ ని ఏర్పాటు చేస్తుంటే.. సిటీలోని కొన్ని పబ్స్, మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్.. క్రికెట్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఫుడ్ అండ్ డ్రింక్స్ పై ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. సినిమా హాల్స్ కూడా పెద్దగా రద్దీగా లేకపోవడంతో.. మ్యాచ్ ను థియోటర్ లో చూసేలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో టికెట్ ధర 500ల నుంచి మూడు వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం.

దీంతోపాటు సిటీలోని అపార్ట్మెంట్స్, కమ్యునిటీ లను ప్రత్యేకంగా స్క్రీనింగ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. కొండాపూర్, కోకాపేట్, జూబ్లిహిల్స్, బంజారహిల్స్ లలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కలిసి భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అవకాశమున్న మరికొందరు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు దుబాయ్ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ కలిసి మ్యాచ్ చూసేందుకు ముందుగానే టికెట్స్ ని బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. 

ఇక వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ కి లేనటువంటి టికెట్ల డిమాండ్.. ఇండో పాక్ మ్యాచ్ కి ఉండటంతో గంటలోనే టికెట్లన్ని అమ్ముడయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 25 వేలు. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం... అక్టోబర్ 4వ తేదిన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది ఐసీసీ. సైట్ లో పెట్టిన గంటలోపే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు ఐసీసీ ప్రకటించింది.

ఆదివారం దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ క్రికెట్ మ్యాచ్ ని యుద్ధంలా భావిస్తున్నారు. టీమిండియాకి విషెష్ చెప్తున్న వీరు... టీమిండియానే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని మ్యాచ్ లు చూడటం కంటే.... బిగ్ స్క్రీన్స్ పై  ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ మ్యాచ్ చూస్తుంటే ఉండే మజానే వేరంటున్నారు.