నెట్టింట ఆగ్రహం.. పాక్ సెలబ్రిటీల అకౌంట్లు మళ్లీ బ్యాన్

నెట్టింట ఆగ్రహం..   పాక్ సెలబ్రిటీల అకౌంట్లు మళ్లీ బ్యాన్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను ఇండియా మరోసారి బ్లాక్ చేసింది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఈ అకౌంట్లను నిలిపివేయగా బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో యూట్యూబ్‌‌‌‌లో పలువురు పాక్‌‌‌‌ సెలబ్రిటీల యూట్యూబ్‌‌‌‌ చానళ్లు కనిపించాయి. ఇన్‌‌‌‌స్టాలోను పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.  ఈ క్రమంలో వారిపై నిషేధాన్ని కొనసాగించాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో పాక్‌‌‌‌ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌‌‌‌లో మళ్లీ బ్లాక్‌‌‌‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు వీరి ఖాతాలను గురువారం ఉదయం నుంచి నిలిపివేసినట్టు సమాచారం. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలువురు పాక్ సెలబ్రిటీలు హనియా ఆమిర్, మహీరా ఖాన్, షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్‌‌‌‌, ఫవాద్ ఖాన్ తదితరుల అకౌంట్లు బ్యాన్ అయిన వాటిలో ఉన్నాయి.