ఇండియాలో కొత్తగా 752 కరోనా కేసులు.. నలుగురు మృతి

 ఇండియాలో  కొత్తగా 752 కరోనా కేసులు.. నలుగురు మృతి

దేశంలో కరోనా వైరస్  కొత్త వేరియంట్ మెల్లగా విజృంభిస్తోంది. దీంతో  దేశవ్యాప్తంగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. కొత్త వేరియంట్ బారిన పడి పలువు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోలన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఇండియాలో 752 న్యూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  కరోనా బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  కేరళలో ఇద్దరు... కర్నాటకలో ఒకరు, రాజస్థాన్ లలో ఒకరు మరణించారు. తాజా కేసులతో దేశంలో కరోనాయాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది.

 తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 9 కరోనా కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కారణంగా  కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. రానున్న రోజులు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.