భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే

భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే

భారత్ లో కరోనా కేసులు నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి. నిన్న 15వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయితే.. తాజాగా దేశంలో 14,418 కోవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి 302 మంది చనిపోయారు. 30009 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చూస్తే.. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 48వేల 359గా ఉంది. డైలీ పాజిటివ్ రేటు 1.22 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య నాలుగు కోట్ల 22 లక్షల, 19వేల 986. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 5,12,924. 

మరోవైపు రాష్ట్రాల వారీగా కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కేవలం వందల సంఖ్యలోనే వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైవు వ్యాక్సిన్ డ్రైవ్ కూడా నడుస్తోంది. పెద్దలతో పాటు.. టీనేజర్లకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు కోట్లకు పైగా టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,76,52,31,385 మందికి వ్యాక్సిన్ అందించారు. 
 

ఇవి కూడా చదవండి:

కేటీఆర్ ను అప్యాయంగా అలా పిలుస్తా

ప్రియాంక పాలిటిక్స్ పన్జేస్తయా?