కేటీఆర్ ను అప్యాయంగా అలా పిలుస్తా

కేటీఆర్ ను అప్యాయంగా అలా పిలుస్తా

జై తెలంగాణ, జై ఆంధ్ర, జై అమరావతి అంటూ పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ ను తాను ఆప్యాయంగా రామ్ బాయ్ అంటానన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు, ఇక్కడ కళాకారులు మాత్రమే ఉంటారన్నారు పవన్. చెనైలో ఉన్న చిత్ర పరిశ్రమను ఎంతో మంది పెద్దలు హైదరాబాద్ కు తీసుకొచ్చారన్నారు. చిత్ర పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్. తాను జనజీవనంలో ఉన్నా సినిమా తనకు అన్నం పెట్టిందన్నారు. 

తాను ఏదో అయిపోతానని కాదు తన రాష్ట్రానికి ప్రజలు ఏదో చేయాలనే సినిమాలు చేస్తానన్నారు. సినిమా అనేది తనకు డబ్బు సంపాదించే వృత్తి అన్నారు పవన్ కళ్యాణ్. సాగర్ తెలుగు చిత్ర పరిశ్రమలో బలమైన దర్శకుడిగా ఎదుగుతాడన్నారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య మడపతిప్పని యుద్ధం భీమ్లానాయక్ అన్నారు పవన్. భీమ్లానాయక్ చిత్రానికి వెన్నముక త్రివిక్రమ్ ఉన్నారు. త్రివిక్రమ్ లేకపోతే భీమ్లానాయక్ లేదన్నారు. తన సినిమాను ఎప్పుడు తాను ప్రమోట్ చేసుకోను, బాగా చేయాలన్న తపనే తప్ప వేరే ధ్యాస ఉండదన్నారు. భీమ్లానాయక్ ప్రేక్షకులందరికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.

ఇవి కూడా చదవండి:

హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్

భారీగా పెరిగిన మనీ లాండరింగ్ కేసుల సంఖ్య